శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 21 మే 2019 (14:02 IST)

ప్రేమను అంగీకరించలేదని ప్రేయసితో కలసి పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య

తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వల్లూరు మండలం గంగాయపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్‌పై సోమవారం అర్ధరాత్రి ఈ జంట ఆత్మహత్య చేసుకుంది. 
 
రైల్వే పోలీసుల కథనం ప్రకారం ప్రియుడు రమేష్ బాబు అనంతపురం జిల్లా 1 టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే రమేష్‌ కుటుంబ సభ్యులు జూన్ 5వ తేదీన వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. తమ పెద్దలు ప్రేమ వివాహం జరిపించకపోవడంతో మనస్థాపం చెందిన ప్రేమ జంట రైల్వే ట్రాక్ పైన తలపెట్టి దారుణానికి పాల్పడ్డారు.