వ్యక్తిగత వంట మనిషి పెళ్లిలో కేసీఆర్ సందడి
సాధారణంగా రాజకీయ నేతలు లేదా సెలెబ్రిటీలు ప్రముఖుల ఇంట జరిగే వివాహాలకు మాత్రమే హాజరవుతుంటారు. తమ ఇళ్లలో పని చేసే పని మనుషుల ఇళ్ళలో జరిగే వివాహాది శుభకార్యాలకు మాత్రం చాలా మేరకు దూరంగా ఉంటారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన వ్యక్తిగత వంట మనిషి పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోను ఎంపీ బాల్క సుమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.
మన కేసీఆర్ సార్.. సెలెబ్రెటీల పెళ్లిళ్లకే కాదు, తన దగ్గర పనిచేసే వాళ్ల పెళ్లిళ్లకు కూడా వెళ్ళి వారిపై తనకు ఉన్న ప్రేమను చాటుకుంటారని చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ దగ్గర వంట పని చేసే వ్యక్తి వివాహానికి కేసీఆర్ హాజరై, అతనికి మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించారని బాల్క సుమన్ ప్రశంసించారు.
"పెళ్ళికొడుకు ఏ రామోజీ మనవడో, అంబానీ తమ్ముడో కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర వంటపని చేస్తాడు. అతని వివాహానికి హాజరై ఇలా ఆత్మీయ ఆలింగనంతో జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్" అంటూ ఆ ఫోటో కింద కామెంట్స్ పెట్టాడు.