శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (10:20 IST)

మసాజ్ ముసుగులో వ్యభిచారం... నగ్నంగా పట్టుబడిన అమ్మాయిలు...

మసాజ్ ముసుగులో గుట్టుచప్పుడుగా కొనసాగుతూ వచ్చిన వ్యభిచారగుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. స్పాసెంటర్ పేరుతో ముగ్గురు అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించిన స్పాసెంటర్ మేనేజరుతో పాటు అమ్మాయిలు, విటులను పోలీసులు అరెస్టు చేశారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు హైదరాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి ప్రధాన రహదారిలోని ఓ భవనంలో 'స్టూడియో మేక్‌ ఓవర్‌ సెలూన్‌ అండ్‌ స్పా' పేరుతో మాసాజ్‌, సెలూన్‌ కేంద్రాన్ని నిర్వాహకురాలు మమత నిర్వహిస్తుంది.
 
ఈ సెంటర్‌లో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ కేంద్రంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో ముగ్గురు వ్యభిచారులు, ఒక విటుడు, ఈ కేంద్రం మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
మేనేజర్‌ శేఖర్‌, విటుడు కిరణ్‌బాబులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించించగా, నిర్వాహకురాలు మమత పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యభిచారులను మహేశ్వరంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.