శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 26 మే 2019 (11:37 IST)

నిన్ను చూసి గర్వపడుతున్నాం జగన్... జగన్ క్లాస్‌మేట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా 151 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 25 సీట్లకుగాను 22 సీట్లను కైవసం చేసుకుంది. 
 
దీంతో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 30వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి క్లాస్‌మేట్స్ ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ బ్యానర్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్ విద్యాభ్యాసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సాగింది. దీంతో 1991 బ్యాచ్‌కు చెందిన క్లాస్‌మేట్స్ ఈ బానర్‌ను ఏర్పాటు చేశారు. 
 
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జగన్‌కు వారు వినూత్నంగా అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని  బేగంపేటలో మెట్రో పిల్లర్స్‌పై జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ డిజిటల్ బోర్డులను ఏర్పాటుచేశారు. ఈ బ్యానర్ ఇపుడు సోషల్ మీడియలో వైరల్ అయింది.