ఆదివారం, 9 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (10:04 IST)

సినిమా విలన్ సీన్లను తలపించేలా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శైలి (Video)

kolikapudi srinivasa rao
గత వైకాపా పాలకులు చేసిన పాపాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పండుతున్నాయి. అధికారులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో అకృత్యాలు, అక్రమాలకు పాల్పడ్డారు. వీటికి ఇపుడు టీడీపీ నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తాజాగా అధికార టీడీపీకి చెందిన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఆయన వ్యవహారం సినిమాలో విలన్ సీన్లను తలపించేలా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఏపీలో సంచలనం రేపుతుంది. 
 
తిరువూరు నియోజకవర్గంలోని ఎ.కొండూరు మండలం కంభపాడులో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌సీపీ ఎంపీపీ భవనం కూల్చివేతకు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన ర్యాలీగా వెళ్లారు. అయితే, ఆయనతో పాటు, ఆయన వెంట తీసుకెళ్లిన బుల్డోజర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, పోలీసులను సైతం వెనక్కినెట్టేసి భవనంలో కొంత భాగం కూల్చివేశారు. ఆ తర్వాత కారుపైకి ఎక్కి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దృశ్యం సినిమా సీన్లను తలపించేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.