1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 16 డిశెంబరు 2021 (11:26 IST)

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ట్రాఫిక్ జామ్!

హైదరాబాద్‌-విజయవాడ మంచి హైవే కావడంతో ఎవ‌రైనా జామ్ అంటూ, అటూ ఇటూ తిరిగేస్తుంటారు. కానీ, ఇపుడు ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. చౌటుప్పల్‌ దండుమల్కాపురం వద్ద రాకపోకలు స్తంభించి, ట్రాఫిక్ జామ్ అవుతోంది. 
 
 
దండుమల్కాపురం వద్ద రోడ్డు మరమ్మతులు చేపడుతుండటం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్ అవుతోంది.  కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రెండు అంబులెన్సులు  కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించినా, క్రమబద్ధీకరించేందుకు ఎన్‌హెచ్‌ అధికారులు స్పందించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ అధికారుల వైఖరిపై వాహనదారులు మండిపడ్డారు. 
 
 
జాతీయ ర‌హ‌దారిపై మ‌ర‌మ్మ‌తులు జ‌రుగుతున్న‌పుడు, వాటిని వేగంగా పూర్తి చేయించ‌డం.. అక్క‌డ ట్రాఫిక్ నిర్వ‌హ‌ణకు సిబ్బందిని ఏర్పాటు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. లేదంటే, ఇలా ట్రాఫిక్ జామ్ అయి, హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ప్ర‌యాణం న‌ర‌క‌ప్రాయం అయిపోతుంది.