మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (09:51 IST)

ఏ శుభకార్యం జరిగినా విజయమ్మ ప్రార్థన చేయాల్సిందే : వైవీ సుబ్బారెడ్డి భార్య (Video)

swarnalatha
తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యం జరిగినా వైఎస్ విజయమ్మ వచ్చి ప్రార్థన చేయాల్సిందేనని తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత వెల్లడించారు. శ్రీవారి కల్తీ లడ్డూ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భావించారు. అయితే, ఆయన అ క్రైస్తమతస్తుడు అని, అన్యమతస్తులు తిరుమలకు వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ తితిదే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
 
ఈ క్రమంలో వైఎస్ కుటుంబం మొత్తం క్రైస్తవమతానికి చెందినవారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అదేసమయంలో వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత గతంలో మాట్లాడిన ఓ వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. మా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా వైఎస్ఆర్ సతీమణి, జగన్ తల్లి వైవీ విజయమ్మ వచ్చి ప్రార్థన చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా విజయమ్మ వచ్చి ప్రేయర్ చేస్తుంది. ఆ తర్వాతే మాకు ఏదైనా.. ప్రేయర్ అయినా, ధ్యానం అయినా.., మంత్రాలు అయినా ఒక్కటే అని సెలవిచ్చారు.