ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (19:33 IST)

శ్రీనివాసా క్షమించు, నీ ఫోటోలతో వ్యాపారం

తిరుమల వేంకటేశ్వరస్వామి పేరు చెప్పుకుని ఎంతోమంది అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు దళారీల అవతారమెత్తి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్న కేటుగాళ్ళు ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడం కొత్త అవతారానికి తెరలేపారు. 
 
టిటిడికి చెందిన క్యాలెండర్లను టిటిడి ముద్రణాలయాల్లోనే మొత్తం ముద్రణ జరుగుతుంటుంది. టిటిడినే నేరుగా అన్ని ప్రాంతాల్లో విక్రయించడంతో పాటు అమేజాన్‌కు ఆ అవకాశం ఇచ్చింది.
 
అమేజాన్ ద్వారా బుక్ చేసుకుంటే టిటిడి ముద్రించిన క్యాలెండర్లు భక్తులకు అందుతుంటాయి. అయితే టిటిడి క్యాలెండర్ మాదిరిగానే మరికొన్ని క్యాలెండర్లను ముద్రించి భక్తులను నిలువుదోపిడీ చేసేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు.
 
రాజమండ్రికి చెందిన ఓ పబ్లికేషన్ గూగుల్ క్రోమో దేవుళ్ళు. డాట్ కామ్ పేరుతో టిటిడి డైరీలు, క్యాలెండర్స్‌ను విక్రయిస్తున్న బాగోతాన్ని టిటిడి విజిలెన్స్ గుర్తించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్లైన్లో క్యాలెండర్లను విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.
 
130 క్యాలెండర్లను 243 రూపాయలకు, 150 రూపాయల క్యాలెండర్ ను 247 రూపాయలకు ఆ పబ్లికేషన్స్ ముద్రిస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణకు టిటిడి ఉన్నతాధికారులు ఆదేశించారు. నకిలీ క్యాలెండర్లను భక్తులకు విక్రయించి డబ్బులు వసూలు చేయడంపై టిటిడి ఉన్నతాధకారులు సీరియస్‌గా ఉన్నారట.