శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (12:02 IST)

ఆ ఇద్దరి రాజీనామా.. ఆ ముగ్గురి నవ్వులు.. చంద్రబాబు ప్రశంసల జల్లు

అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన భాజాపా నేతలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయ

అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన భాజాపా నేతలు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నుంచి  వైదొలిగారు. సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. అంతకుముందు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయంలో కూర్చుని ఉండగా తెదేపా మంత్రులు వారిని కలిశారు.
 
పదవుల నుంచి తప్పుకుంటున్నందుకు బాధగా వుందా అని తెదేపా మంత్రి ప్రశ్నించగా.. ప్రజల కోసం రాజీనామా చేసినట్లు చెప్పారు. పదవి నుంచి సంతోషంగా వైదొలుగుతున్నట్లు చెప్పారు. ఆ తరువాత మంత్రి మాణిక్యాలరావును కలిసిన గంటా మిమ్మల్ని అభినందించాలా? లేక సానుభూతి వ్యక్తంచేయాలా? అని అడిగారు. ఎప్పటిలాగానే అభినందించండంటూ మాణిక్యాలరావు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా గంటా, మాణిక్యాలరావు, కామినేనిల మధ్య నవ్వులు పూశాయి.
 
మరోవైపు వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావులు తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. బీజేపీ తరపున ఎంపికైన ఇద్దరు మంత్రులు సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. 
 
కృష్ణా, గోదావరి పుష్కరాలను మంత్రి మాణిక్యాలరావు సమర్థవంతంగా నిర్వహించారని, వైద్య ఆరోగ్యశాఖలో కామినేని శ్రీనివాస్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని కితాబిచ్చారు. ఓ ముఖ్యమంత్రిగా వారి సమర్థవతమైన సేవలను అభినందిస్తున్నానని బాబు వ్యాఖ్యానించడంతో.. అసెంబ్లీలో కేబినెట్ సహచరులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.