సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 24 నవంబరు 2018 (20:09 IST)

విజయవాడ బస్టాండులో ఇద్దరు కానిస్టేబుళ్ల వికృత చేష్టలు

పండిట్ నెహ్రు బస్ స్టాండులో ఒంటరిగా ఉన్న ఓ యువతి పట్ల ఇద్దరు కానిస్టేబుల్స్ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఫుల్‌గా మద్యం సేవించిన ఇద్దరు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ తెలంగాణలో కొండాపూర్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్స్ నాగేశ్వరరావు, వెంకటేష్‌గా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
కానిస్టేబుల్స్ కావడంతో విజయవాడ పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు రావడంతో సిబ్బందిపై సీపీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుపై జాప్యం ఎందుకు చేశారంటూ ఆయన నిలదీసినట్లు సమాచారం. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.