1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2016 (12:34 IST)

నెల్లూరులో ప్రేమ పేరుతో మోసగించి ఇద్దరు విద్యార్థినిలపై అత్యాచారం

నెల్లూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు ప్రేమ పేరుతో మోసపోయి అత్యాచారానికి గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద

నెల్లూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థినిలు ప్రేమ పేరుతో మోసపోయి అత్యాచారానికి గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని ఓ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరిని స్కూలు యూనిఫాం ధరించిన మరో ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మోసం చేశారు. 
 
ఈ సమయంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు యువకులతో కలిసి విద్యా ర్థినులపై అత్యాచారం చేసినట్లు అక్కడి పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. సంఘటన స్థలంలో టిఫిన్ బాక్స్‌, స్ఫూన్ పడి ఉన్నాయి. వీరి మధ్య పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, ఈ విషయం బయటికి రాకుండా సదరు కళాశాల యాజమాన్యం బాధిత విద్యార్థినులకు రూ.5 లక్షల పరిహారం అందజేయడంతో పాటు వారికి చికిత్స చేయిస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి.