శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఆగస్టు 2020 (07:49 IST)

కోవిడ్-19 టెస్టుల్లో రకాలు - తెలుసుకోవాల్సిన అంశాలు

కోవిడ్-19 వైరస్ వచ్చి దాదాపు నాలుగు నెలలు దాటింది. దేశ వ్యాప్తంగా రోజువారీగా 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటికీ చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నియమాలను పెద్దగా పాటించడం లేదు. కోవిడ్ వ్యాప్తికి ఇదీ ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే ఎలాంటి పరీక్షలు చేస్తారన్నదానిపైనా ప్రజలు అవగాహన పెంచుకుంటే మంచిది. 
 
1. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్:
దీన్ని రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ అంటారు. ఈ పరీక్షని మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100శాతం పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99శాతం నెగిటివ్ అని అర్ధం.  వైరస్‌ నిర్ధారణలో ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ పద్ధతిగా గుర్తిస్తున్నారు.   
 
2. ర్యాపిడ్ ఆంటిజెన్ టెస్ట్:
ఈ పరీక్ష కూడా స్వాబ్ ద్వారానే పరీక్షస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100% పాజిటివ్ అనే అర్ధం . నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి 
 
3. ట్రూనాట్ పరీక్ష:
ఆర్టీ-పీసీఆర్ మాదిరిగానే పనిచేస్తుంది. అలాగే వేగంగా ఫలితాలను ఇస్తుంది. కోవిడ్ -19 కోసం స్క్రీనింగ్ మరియు నిర్ధారణ కోసం ఈ పరీక్ష చేస్తారు. ఇది కూడా నోరు, ముక్కు లోని స్వాబ్ ద్వారా వైరస్ కనుగొనాల్సి ఉంది.
 
4. హెచ్ఆర్సీటీ -లంగ్స్ (సిటి స్కాన్ ):
ఆంటిజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ హెచ్ఆర్సీటీ - చెస్ట్ లో పాజిటివ్ వచ్చిన కేసులు చాలా వున్నాయి. 
హెచ్ఆర్సీటీలో ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఎంత వుంది స్కోరింగ్ కూడా రిపోర్ట్ లో వస్తుంది ఇది కూడా ముఖ్యమైన పరీక్ష. 
 
5. ఆంటిబాడీ టెస్ట్:
ఈ పరీక్షని రక్త నమూనాలను సేకరించి చేయడం జరుగుతుంది. ఫలితం ఒక రోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితం సరి అయినది కాదు. కావున  క్రియాశీల కోవిడ్ ని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్షను ఎంచుకోవలదు
 
మనకు కోవిడ్ వచ్చిందా? లేదా? అని తెలుసుకునేందుకు ఆంటిజెన్ లేదా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఆంటిబాడి టెస్టులు వైరస్ ఎంత మందికి వచ్చింది? హెర్డ్ ఇమ్యూనిటీ ఎలా ఉంది? ప్లాస్మాథెరపీకి ప్లాస్మా ఇవ్వొచ్చా? అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేయాలి.

సిటీస్కాన్ అనేది కోవిడ్ ను నిర్ధారించలేదు. ఎవరైనా సిటీస్కాన్ ఆధారంగా కోవిడ్ వైద్యం చేసినా, ప్రభుత్వానికి తెలియపరచకుండా వైద్యం చేసినా శిక్షార్హులని ఇదివరకే ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ పై ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్ 104, 1902 కాల్ చేయవచ్చు.