బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2025 (13:21 IST)

ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసిన అంబులెన్స్!!

ambulance
ఓ అంబులెన్స్ వాహనం ఇద్దరు శ్రీవారి భక్తుల ప్రాణాలు తీసింది. కాలినడకన శ్రీవారి దర్శనం కోసం బయలుదేరిన భక్తులు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతుండగా అంబులెన్స్ ఢీకొట్టడంతో ప్రాణఆలు కోల్పోయారు. ఓ అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మహిళా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద ఈ ఘోరం చోటుచేసుకుంది.  
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు.. పుంగనూరు నుంచ కాలినడకన తిరుమలకు వెళుతున్న భక్తులను మదనపల్లె నుంచి తిరుపతికి రోగిని తీసుకెళుతున్న అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన శ్రీవారి భక్తులను అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ, లక్ష్మమ్మగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన భక్తులను తిరుపతిలోని రుయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు.