1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:18 IST)

శ్రీకాళహస్తిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకునాయి. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానమైన తొండమనాడు వెలసివున్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని  పురస్కరించుకుని  మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, హృదయాలను హత్తుకునే పుష్పాలతో ఆధ్యాత్మికశోభతో కళకళలాడుతు తిరుమల తరహాలో వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

వేకువజామున శ్రీవారి ఆలయాన్ని తెరిచి పూజాది కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఏకాంతంగా స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన పిదప భక్తులకు స్వామివారి దర్శనం కావించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, చలువ పందిళ్లు, ఏర్పాటుచేశారు.

ఆలయలలో స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆలయపరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయి గోవింద నమస్కారాలతో  మారుమోగిన ఆలయాలు, భక్తులు  తెల్లవారుజామునుంచే  ఉత్తర ద్వారంద్యారా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.