శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (23:19 IST)

శ్రీకాళహస్తిలో మరో 11 కరోనా కేసులు

కరోనా వైరస్ మహమ్మరి పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నీ గడగడలాడిస్తూంది. తాజాగా పట్టణంలో విధినిర్వహణలో ఉన్న రెవెన్యూ,  పోలీస్,  వార్డు సచివాలయం ఉద్యోగ  సిబ్బందికి వ్యాప్తి చెందింది. 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య శాఖ  అధికారులకు సమాచారం అందింది. 
 
శ్రీకాళహస్తి పట్టణంలో కరోనా వైరస్ మహమ్మరి పడగలు విప్పి బుసలు కొడుతుంది. తాజాగా 11 మందికి కరోనా  పాజిటివ్ వచ్చినట్లు వైద్య శాఖ అధికారులకు సమాచారం అందింది. శ్రీకాళహస్తి రెవెన్యూ శాఖకు చెందిన ఓ సర్వేయర్  కు రెవెన్యూ కార్యాలయం లోని  డ్రైవర్లు అటెండర్ లకు మొత్తం రెవెన్యూ శాఖ లోని ఐదు మంది కి కరుణ పాజిటివ్ గా నమోదు అయింది.

టూ టౌన్ లోని ఓ మహిళ ఎస్ ఐ కు  కరోనా  పాజిటివ్ గా వచ్చింది. వార్డు సచివాలయం లో పనిచేసే ఉమెన్స్ ప్రొడక్షన్ ఉద్యోగినీ,.  మరో వార్డు కార్యదర్శి కి  పాజిటివ్ గా వచ్చింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న అన్నదమ్ములు ఇద్దరికీ పాజిటివ్ గా వచ్చింది. ఢిల్లీ కాంటాక్ట్స్ కు సంబంధించి ఓ యువతికి కరోనా  పాజిటివ్ గా వచ్చింది.

సమాచారం అందుకున్న వెంటనే వైద్యశాఖ మున్సిపల్ అధికారులు ట్రైనింగ్ ఐఏఎస్ పృద్వి ఆధ్వర్యంలో హుటాహుటిన చర్యలు చేపట్టారు.  పాజిటివ్ వచ్చిన  అందర్నీ  తిరుపతిలోనీ  ఐసోలేషన్ వార్డుకు  తరలింపు చేపట్టారు. 
 
భయకంపితు లౌ  అవుతున్న  ఉద్యోగ సిబ్బంది
తాజాగా వెలుగు చూసిన పాజిటివ్ కేసులు అన్ని  విధినిర్వహణలో ని రెవెన్యూ మున్సిపల్ పోలీస్ శాఖకు చెందిన వారే కావడంతో ఉద్యోగ సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఒక్కసారిగా ఆందోళనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే ట్రైనింగ్ ఐఏఎస్ పృద్వి కమిషనర్ కు ధైర్యం చెప్పారు.