1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:01 IST)

కృష్ణా పుష్కరాలు : విజయవాడలో మాంసాహారంపై నిషేధం!

పరమ పవిత్రమైన పుష్కరాలు ఈనెల తొమ్మిదో తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడ పరిసరాల్లో మాంసం, చేపలు తదితరాల విక్రయాలను నిషేధిస్తున్నట్టు విజయవాడ నగర కమిషనర్ జి.వీ

పరమ పవిత్రమైన పుష్కరాలు ఈనెల తొమ్మిదో తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడ పరిసరాల్లో మాంసం, చేపలు తదితరాల విక్రయాలను నిషేధిస్తున్నట్టు విజయవాడ నగర కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. ఈ మేరకు అన్ని గోవధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
అలాగే, హోటళ్లలో సైతం మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. నగరానికి వచ్చే భక్తులు, యాత్రికుల మనోభావాలను వ్యాపారులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.