రేషన్ కార్డు ఉంటే చాలు.. 8 దేవాలయాలను ఉచితంగా దర్శించుకోవచ్చు: చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభించారు. దివ్యదర్శనం పథకం కింద ఏపీలోని 8 పెద్ద దేవాలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతిజిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభించారు. దివ్యదర్శనం పథకం కింద ఏపీలోని 8 పెద్ద దేవాలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతిజిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. రవాణా ఖర్చుతో పాటు భక్తులకు ఉచితంగా దర్శనం, వసతి, భోజనం వసతులు కల్పిస్తారు. సోమవారం ఉదయం విజయవాడలో సీఎం చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది.
ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవాదాయశాఖను అభినందిస్తున్నానని వెల్లడించారు. రేషన్‌కార్డు ఉంటే చాలు ఈ పథకం కింద రవాణా, దర్శనం, వసతి, భోజనం ఉచితంగా కల్పిస్తారని వెల్లడించారు.
భక్తులను ఇంటికి వచ్చిన అతిథులుగా చూసే బాధ్యత దేవాదాయశాఖ తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుమలకు వైకుంఠమాల పేరుతో కొత్తరోడ్డు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.