దుర్గగా మారిన దుర్గారావు... మోసం చేసిన రాకేష్
విజయవాడ: హోమో సెక్సువల్స్ చేసుకున్న పెళ్ళి కూడా పెటాకులై, పోలీసుల చెంతకు ఫిర్యాదు వచ్చింది. బెజవాడ పోలీసులు ఇపుడు ఈ వింత కేసుపై తలలు పట్టుకుంటున్నారు. పెనమలూరుకు చెందిన రాకేష్, ములుగు దుర్గారావు హోమోలుగా 2009లో పెళ్ళి చేసుకుని, 2014 వరక
విజయవాడ: హోమో సెక్సువల్స్ చేసుకున్న పెళ్ళి కూడా పెటాకులై, పోలీసుల చెంతకు ఫిర్యాదు వచ్చింది. బెజవాడ పోలీసులు ఇపుడు ఈ వింత కేసుపై తలలు పట్టుకుంటున్నారు. పెనమలూరుకు చెందిన రాకేష్, ములుగు దుర్గారావు హోమోలుగా 2009లో పెళ్ళి చేసుకుని, 2014 వరకు సహజీవనం చేశారు. 2011లో దుర్గారావు లింగమార్పిడి చేసుకుని దుర్గగా మారిపోయాడు.
2014 చివరిలో దుర్గ ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం ముంబయి వెళ్ళింది. ఆ సమయంలో రాకేష్ రెండో పెళ్ళి చేసుకున్నాడు. ముంబయి నుంచి తిరిగి వచ్చిన దుర్గ నిలదీయండంతో రాకేష్ కాళ్ళబేరానికి వచ్చాడు. నీకు పది లక్షలు ఇస్తా... నన్నొదిలేయ్ అంటూ, ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. గుడ్డిగా నమ్మిన దుర్గ తర్వాత రాకేష్ ఫోన్ నెంబర్లు మార్చేయడంతో తాను మోసపోయానని తెలుసుకుంది.
రాకేష్ తండ్రి కానూరులోని సిండికేట్ బ్యాంక్ మేనేజరుగా పనిచేస్తేన్నాడు. ఆయన్ని కలిసి రాకేష్ గురించి ప్రశ్నించగా, నాకే సంబంధం లేదు... అంటూ దుర్గపైనే ఎదురుకేసు పెట్టాడు. బెజవాడ నుంచి వెళ్లిపోయి రాకేష్ ఒంగోలులో కాపురం పెట్టాడని, తనకు న్యాయం చేయాలని దుర్గ పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు ఎలా పరిష్కరించాలా అని ఇపుడు పెనమలూరు పోలీసులు తలలు పట్టుకున్నారు.