శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (07:21 IST)

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సిబిఏఎస్ పరీక్షలు ఉండవు

గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు ఎవరూ ప్రొబేషన్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ అన్నారు. 

ఏపిపిఎస్ సి ద్వారా నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు మినహా ఎలాంటి పరీక్షలు ఉండబోవని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. సిబిఏఎస్ (Credit based assessment system)  కానీ ఏ ఇతర అదనపు పరీక్షలు కానీ ఉద్యోగులకు నిర్వహించరని చెప్పారు.

2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటు చేశారని అప్పటి నుంచి రెండేళ్లు పూర్తి చేసుకున్న 1.34 లక్షల మంది ఉద్యోగులంతా కేవలం డిపార్టుమెంటల్ పరీక్షలు పాసైతే చాలు అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ స్పష్టం చేశారు.