గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (19:20 IST)

తిరుమల కొండ వద్ద ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్.. సారీ చెప్పిన యువతి (video)

Kissik
Kissik
తిరుమల కొండ వద్ద ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసిన యువతి వీడియో వైరల్ అవుతోంది. ఇటువంటి చిల్లర పనులు చేసినందుకు తీసుకువెళ్లి దెబ్బలు వేయాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. భక్తితో మెలగాల్సిన ఆ ప్రాంతంలో రీల్స్ చేస్తూ  అపవిత్రం చేస్తున్నారని పలువురు భక్తులు మండిపడుతున్నారు. 
 
ఇటీవలే ఓ అమ్మాయి తిరుమల కొండ వద్ద పుష్ప2 సినిమాలోని శ్రీలీల డాన్స్ చేసిన 'కిస్సిక్' సాంగ్‌కు డాన్స్ చేస్తూ వైరల్ అయిపోయింది. తిరుమల కొండ దిగువన ఉన్న ప్రాంతం అలిపిరి టోల్గేట్ ముందు డాన్స్ చేసి వీడియో తీసిన యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేసింది. 
అది కాస్త వైరల్ అవ్వడంతో పలువురు భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. టీటీడీ యంత్రాంగం ఎన్నిసార్లు చెప్పినా తిరుమల వద్ద ఇలా రీల్స్‌, ప్రాంకులు చేస్తూ అపవిత్రం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై టీటీడీ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చర్యకు సదరు యువతి క్షమాపణలు చెప్తూ వీడియో విడుదల చేసింది.