మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (13:27 IST)

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

flying snake
flying snake
పరీక్షిత్తును తక్షకుడనే పాము కాటేసినట్లు మహాభారతంలో చదువుకుని వుంటాం. అదే పేరుతో పిలిచే ఓ అరుదైన పాము జార్ఖండ్‌లోని రాంచీలో కనిపించింది. 
 
ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన దాన్ని చూసి అధికారులు కంగారు పడ్డారు. అంతరించిపోతున్న పాముల జాబితాలో ఉన్న తక్షక నాగు చెట్లపై నివసిస్తుంటుంది. 
 
చెట్ల మీది నుంచి చెట్ల మీదకు గాల్లోనే 100 అడుగుల వరకూ ప్రయాణించగలదు. వందల ఏళ్లు బతుకుతుందనేది ఉత్తరాది గ్రామాల్లో ఓ విశ్వాసం.

ఓ ప్రభుత్వ కార్యాలయంలోకి ఎక్కడి నుంచో చొరబడిన ఆ పామును చూసి అక్కడున్న అధికారులు భయంతో వణికిపోయారు. మామూలు పాములకు భిన్నంగా ఉన్న ఆ సర్పాన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.