శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2017 (09:41 IST)

పట్టపగలే నడిరోడ్డుపై యాచకురాలిపై అత్యాచారం.. వీడియో తీశారే కానీ?

తాగిన మైకంలో ఓ యువకుడు పట్టపగలే యాచకురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని నిలువరించాల్సిన ప్రజలు తలదించుకున్నారు. మద్యం తాగి దారుణానికి ఒడిగట్టిన యువకుడిని అడ్డుకోవాల్సింది పోయి.. కొందరైతే దీన్ని

తాగిన మైకంలో ఓ యువకుడు పట్టపగలే యాచకురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని నిలువరించాల్సిన ప్రజలు తలదించుకున్నారు. మద్యం తాగి దారుణానికి ఒడిగట్టిన యువకుడిని అడ్డుకోవాల్సింది పోయి.. కొందరైతే దీన్ని ఆనందంగా వీడియోలు తీసుకున్నారు. సభ్యసమాజం తలదించుకున్న ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం, శ్రీనివాస కల్యాణమండపం రోడ్డులో యాచకురాలిగా జీవిస్తున్న ఓ మతిస్థిమితం లేని యువతిపై, రైల్వే న్యూ కాలనీకి చెందిన గంజి శివ (25) మద్యం తాగి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
రోడ్డు మార్గంలో పయనించేవారు.. పాదచారులు ఈ ఘటనను తమ కళ్లారా చూశారే కానీ.. ఎవరూ అడ్డుకోలేదు. అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ అర్జి శ్రీను ఘటనను వీడియో తీస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆపై గంజి శివను అరెస్ట్ చేశామని, బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.