పెద్ద నోట్ల రద్దు సరైన చర్య కాకుంటే ప్రజలే చెప్పుతో కొడతారు : బీజేపీ ఎంపీ
దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య కాకుంటే ప్రజలే తమకు తగిన బుద్ధి చెప్పేలా చెప్పుతో కొడతారని భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్టణం ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...
దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైన చర్య కాకుంటే ప్రజలే తమకు తగిన బుద్ధి చెప్పేలా చెప్పుతో కొడతారని భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్టణం ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైంది కాకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని, అలాగే నోట్లను దారిమళ్లించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
దేశంలో పెరిగిపోతున్న నల్లధనాన్ని, నకిలీ కరెన్సీని అరికట్టేందుకే నోట్ల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. నోట్ల రద్దుపై పార్లమెంట్‌లో చర్చించకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయన్నారు. నల్లధన కుబేరులు కాంగ్రెస్ పార్టీలోనే అధికంగా ఉన్నారన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ ఆరోపించారు.
కాగా, జాతీయ గీతంపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, ప్రభుత్వానికి సంబంధం లేదని, ఏ యూనివర్సిటీ విషయంలో బీజేపీ జోక్యం చేసుకోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌కు పరోక్షంగా హరిబాబు కౌంటర్ ఇచ్చారు.