శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (15:52 IST)

స్వాతంత్ర్యం తర్వాత ఇదే అత్యుత్తమైన ప్యాకేజీ...: వైజాగ్ ఎంపీ హరిబాబు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీపై భారతీయ జనతా పార్టీకి చెందిన వైజాగ్ ఎంపీ హరిబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక బలం పె

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీపై భారతీయ జనతా పార్టీకి చెందిన వైజాగ్ ఎంపీ హరిబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక బలం పెరిగేలా అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ మహోన్నతమైనదన్నారు. 
 
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ తరహా ప్యాకేజీ ఎన్నడూ రాలేదని చెప్పుకొచ్చిన ఆయన, విజయవాడకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వే జోన్ రాదని, విశాఖకే వస్తుందన్నారు. విజయవాడకు జోన్ రానున్నట్టు బుధవారం జరిగిన ప్రచారం పూర్తి అవాస్తవమని, అసలా ఉద్దేశమే కేంద్రానికి లేదని తెలిపారు.