శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 12 సెప్టెంబరు 2016 (14:10 IST)

సుప్రీం కోర్టుకు వెళ‌తావా... మంగ‌ళ‌గిరిలోనే న‌రుకుతాం... ఎమ్మెల్యే ఆర్.కె.కి బెదిరింపు

సుప్రీం కోర్టుకు వెళ‌తావా... మంగ‌ళ‌గిరిలోనే న‌రుకుతాం... ఎమ్మెల్యే ఆర్.కె.కి బెదిరింపు

మంగ‌ళ‌గిరి:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఓటుకు నోటుపై హైకోర్టులో కేసు వేసిన త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణారెడ్డి ఆరోపించారు. త‌న‌కు వ‌చ్చిన బెదిరింపు లేఖ‌ను ఆయ‌న మీడియాకు చూపించారు. సీఎంపై హైకోర్టుకు వెళితే, స్టే తెచ్చుకున్నామ‌ని... ఇపుడు సుప్రీంకు వెళ్ళే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు తెలిసింద‌ని... అలా చేస్తే... మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనే త‌న‌ను న‌రుకుతామ‌ని ఈ లేఖ‌లో దుండ‌గులు పేర్కొన్నార‌ని ఎమ్మెల్యే వెల్ల‌డించారు.
 
మా సంగ‌తి నీకు తెలియ‌దు... ఓటుకు నోటుపై మ‌ళ్ళీ సుప్రీంకు వెళ్లే ఉద్దేశంలో ఉన్నావ‌ట‌... నిన్ను మంగ‌ళ‌గిరిలోనే నరుకుతాం... అని లేఖ‌లో బెదిరిస్తున్నార‌ని ఏఆర్కె తెలిపారు. ఈ లేఖ‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని, అయినా వారిలో పెద్ద‌గా స్పంద‌న లేద‌ని ఎమ్మెల్యే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం చంద్ర‌బాబుపై న్యాయ‌పోరాటం చేస్తున్న త‌న‌కు ప్రాణ ర‌క్ష‌ణ లేద‌ని ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి చెప్పారు.