శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (21:24 IST)

ప్రాజెక్టుల నుంచి స‌ముద్రంలో వ‌దులుతున్న నీరు చూస్తే... గుండె చెరువైపోతుంది, ఇదీ లెక్క

విజ‌య‌వాడ‌: నీళ్ళ‌ను టిఎంసీ ల‌లో, క్యూసెక్‌ల‌లో కొలుస్తార‌ని మ‌న‌కు తెలుసు. కానీ, వాటి ప‌రిమాణం ఎంతో అర్ధం కాదు... గోదావరి నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాల‌య్యాయ‌ని న్యూస్ పేప‌ర్లో చ‌దువుతుంటాం. కానీ, ఎంత నీరు వెళ్ళింద‌నే అంచ‌నాకు రాలేము.

విజ‌య‌వాడ‌: నీళ్ళ‌ను టిఎంసీ ల‌లో, క్యూసెక్‌ల‌లో కొలుస్తార‌ని మ‌న‌కు తెలుసు. కానీ, వాటి ప‌రిమాణం ఎంతో అర్ధం కాదు... గోదావరి నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాల‌య్యాయ‌ని న్యూస్ పేప‌ర్లో చ‌దువుతుంటాం. కానీ, ఎంత నీరు వెళ్ళింద‌నే అంచ‌నాకు రాలేము... అందుకే మీకు ఓ అయిడియా ఇస్తున్నాం...
ఒక టిఎంసీ  = 1,000 మిలియ‌న్ క్యూబిక్ అడుగులు; అంటే 28,316,846,592 లీట‌ర్ల నీర‌న్న‌మాట‌.
ఒక క్యూసెక్ = క్యూబిక్ అడుగు (సెక‌నుకు) ... అంటే 28.317 లీట‌ర్ల నీరు (సెక‌నుకు)
 
చాలామందికి ఈ అంకెల ద్వారా ఎంత నీరు మ‌న‌కు వృధాగా స‌ముద్రంలో క‌లుస్తోందో స‌రైన అవగాహన కల‌గ‌దు. కాని, ఈ అంకెలను మనకు తెలిసిన విషయాలతో పోల్చడం వల్ల , చాలా సులభంగా ఎంత నీరు వేస్టు అయిందో అవగాహన అవుతుంది. ఒక టిఎంసి నీరు అంటే దాదాపు 15 రోజులపాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా) ఉపయోగించే నీటితో సమానం.
 
నాగార్జున సాగర్ డ్యామ్ కెపాసిటి 400 టిఎమ్‌సిలు... అంటే దాదాపు 17 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి (70 లక్షల జనాభా వున్న) సరిపోయేంత నీరు అని అర్థం. ఒక లక్ష క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రంలోకి వదిలారంటే నాలుగు న్నర నెలల పాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందన్న‌మాట‌.
 
22,000 క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రంలోకి వదిలారంటే = ఒక నెల పాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.
 
700 క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే = ఒక రోజు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అర్ధం. చూశారుగా...ఎంత నీరు ఇలా వృధాపోతోందో.