శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (19:22 IST)

ఉయ్ విల్ టేక్ కేర్.. పవన్ ట్వీట్ పై పళని స్పందన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినతిపై తమిళనాడు సీఎం పళనిస్వామి సత్వరం స్పందించారు. ఏపీ జాలర్లను జాగ్రత్తగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి సంబంధించి సంబంధిత శాఖకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని, వారిని జాగ్రత్తగా చూసుకుంటామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

ఈ వ్యవహారాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన సుమారు 30 మంది మత్స్యకారులు చేపల వేట కోసం తమిళనాడు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా చెన్నై హార్బర్‌ దగ్గర చిక్కుకుపోయారు.

ఈ విషయం తమ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామిలను ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పళనిస్వామికి తమిళంలో ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన పళని..  వారి బాగోగులు చూసుకుంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఏపీ సీఎంవో నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.