మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (17:08 IST)

పట్టణ ప్రాంతాల్లో ప్రతి వార్డుకు ఒక రైతు బజారు: ఏపి సీఎస్ ఆదేశం

రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు కోనుగోలు చేసుకునేందుకు ఉదయం 6 నుండి 11గంట‌ల వరకూ మాత్రమే ప్రజలు ఇళ్ళ నుండి బయటకు వచ్చి వాటిని కొనుగోలు చేసేందుకు అనుమతించడం జరిగిందని ఈ నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని ఆదేశించారు.

కరోనా వైరస్‌పై ఆదివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆమె జిల్లా కలెక్టర్లు, ఎస్పీల‌తో వీడియో సమావేశం (వీసీ) నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వీసీలో సిఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు కోనుగోలు చేసుకునేందుకు ఉదయం 6గం.ల నుండి ఉద‌యం .11గం.ల వరకూ మాత్రమే ప్రజలు ఇళ్ళ నుండి బయటకు వచ్చి వాటిని కొనుగోలు చేసేందుకు అనుమతించడం జరిగిందని ఈ నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు.

నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని చెప్పారు. అదేవిధంగా ధరలు పెరుగుదల నియంత్రణలో భాగంగా ప్రతి రైతు బజారు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలలో ధరల పట్టికను ఆయా షాపుల ముందు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. రైతు బజారులు వద్ద రద్దీని నివారించేందుకు వీలుగా పట్టణ ప్రాంతాల్లో ప్రతి వార్డుకు ఒక రైతు బజారు ఉండేలా చూడాలని ఆదేశించారు.

వీలైనంత వరకు ఇంటింటా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లుకు సూచించారు. నిత్యావసర సరుకులు ఇతర అత్యవసర సేవలకు సంబంధించి ఎక్కడైనా సమస్యలుంటే తెల్సుకుని పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో 1902 నంబరుతో 24గంటలూ కంట్రోల్ రూమ్ పని చేస్తోందని అదే రీతిలో జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

జిల్లా,పట్టణ, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వైరస్ కార్మికులు విద్యార్థులు కూలీలు వంటివారికి వారున్న చోటే తగిన ఆహారం వసతి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.ఇటీవల ఢిల్లీలో దర్గాలో ప్రార్థనలకు వెళ్ళి వచ్చినవారి జాబితాను పోలీస్ డైరెక్టర్ జనరల్ అన్ని జిల్లాలకు పంపనున్నారని అలాంటి వారిని సత్వరమే గుర్తించి 14 రోజులు పాటు హోం ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కేంద్రాలో ఉంచాలని సిఎస్ నీలం సాహ్ని కలెక్టర్లు ఎస్పీలకు స్పష్టం చేశారు.

ఆసుపత్రుల సన్నద్ధత తోపాటు ఆరోగ్య సిస్టం మొత్తం పటిష్టం చేయాలని ఆదేశించారు.అదే విధంగా పారిశుద్ధ్య,శానిటైజేషన్ ప్రక్రియను మెరుగు పర్చాలని సిఎస్ నీలం సాహ్ని ఆదేశించారు.విదేశాల నుండి వచ్చిన వారందరినీ గుర్తించి హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కేంద్రాలలో ఉంచాలని ఆదేశించారు.ఎక్కడైనా ఎవరైనా జ్వరం,జలుబు,దగ్గు వంటి వాటితో బాధ పడుతున్నట్టు గుర్తిస్తే వెంటనే ఐసోలేషన్ లో ఉంచాలని అన్నారు. 

మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలతో పాటు ఇతర సరుకు రవాణా చేసే కార్గో వాహనాలు ఎక్కడా ఆటంకం లేకుండా వాటి నిర్దేశిత ప్రాంతాలకు సకాలంలో చేరుకునేలా చూడాలని ఎస్పిలకు స్పష్టం చేశారు.

ఈసమాచారం క్షేత్ర స్థాయిలోని ప్రతి పోలీస్ స్టేషన్,ప్రతి కానిస్టేబుల్ స్థాయి వరకూ వెళ్ళేలా ఎస్పీలు చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు. వ్యవసాయ సీజన్ వచ్చినందున గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు,చేపల,రొయ్యల చెరువులలో పనిచేసేందు వెళ్ళె కూలీలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని అలాంటి వారిని ఆయా పనులకు అనుమతించాలని చెప్పారు.

పట్టణ ప్రాంతాల్లో ఈ.6గం.ల నుండి ఉ.11గం.ల వరకూ కూరగాయలు,ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అనుమతించాలని ఆతర్వాత ఎవ్వరూ రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ లను ఆదేశించారు.ఇటీవల ఢిల్లీలో దర్గాలో జరిగిన మత ప్రార్థనలకు రాష్ట్రం నుండి 472 మంది వెళ్ళి వచ్చినట్టు వారి వివరాలను సేకరించామని వివరాలను జిల్లాలకు పంపుతున్నిమని వెంటనే అలాంటి వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచేందుకు కలెక్టర్లు ఎస్పీలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. 

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ  ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.సింపమాటిక్ సర్వేను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్లును ఆదేశించారు. కరోనాకు సంబంధించి మొదటి దశగా దేశ వ్యాప్తంగా 20 హోట్ స్పాట్ ప్రాంతాలను గుర్తించిందని అదృష్ట వశాత్తూ వాటిలో మన రాష్ట్రం లేదని అన్నారు.