బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (16:14 IST)

ఉపాసన ఛానల్‌కు అవార్డు

మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ సతీమణి సొంతంగా 'కొణిదెల' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉపాసన కొన్ని హెల్త్ టిప్స్ చెబుతోంది. అంతేకాదు ఇటీవల సానియా మీర్జా, సల్మాన్ ఖాన్, సమంత వంటి సెలెబ్రిటీలని ఇంటర్వ్యూలు చేసింది. దాంతో కొణిదెల యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు వేగంగా పెరిగారు. దీనితో ఉపాసనకు యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లగ్ మెమెంటో లభించింది.
 
ఈ విషయాన్ని ఉపాసన అభిమానులకు తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఈ ఘనత సాధించడానికి మీ ఆదరణే కారణం అని తెలిపింది. అంతేకాదు.. ఇందులో భర్త రామ్ చరణ్‌కి క్రెడిట్ ఇచ్చింది. ఈ సందర్భంగా నేను మిస్టర్ సికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 
 
నేను ఏ కార్యక్రమం చేసినా మిస్టర్ సి నన్ను ప్రోత్సహిస్తున్నాడని రాసుకొచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ "ఆర్ఆర్ఆర్" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.