గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (13:53 IST)

రామోజీరావు ఇంట పెళ్లి సందడి... తరలిరానున్న ప్రముఖులు...

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి సీహెచ్. రామోజీరావు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు సీహెచ్ కిరణ్ పెద్ద కుమార్తె సహరి వివాహం ఈనెల 28వ తేదీన జరుగనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న రామ

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి సీహెచ్. రామోజీరావు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు సీహెచ్ కిరణ్ పెద్ద కుమార్తె  సహరి వివాహం ఈనెల 28వ తేదీన జరుగనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లికి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలను పంపించారు. 
 
ఈ పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్‌ నరసింహన్‌తో పాటు.. పలువురు కేంద్ర మంత్రులతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు, వీవీఐపీలు హాజరవుతారని భావిస్తున్నారు. ఇక తన ఇంట చాలా సంవత్సరాల తరువాత జరుగుతున్న వేడుక కావడంతో, మనవరాలి వివాహాన్ని గుర్తుండిపోయేలా జరిపించాలని రామోజీరావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగిన రీతిలోనే ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు.