బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (19:21 IST)

సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాల పట్టికలో ఆంధ్రప్రదేశ్‌ది ఎన్నో స్థానం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో తమ స్థానాన్ని పదిలపరుచుకుంది. ప్రజలకు ఉత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడో స్థానం దక్కింది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (పీఏసీ) ఈ మేరకు పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్-2020 జాబితా విడుదల చేసింది.
 
ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0.531 పాయింట్లు లభించాయి. ఇక సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు తర్వాత స్థానంలో నిలిచింది. సమానత్వం, స్థిరత్వం, అభివృద్ది ప్రాతిపదికన ఈ ఎంపిక జరిగింది. ఈ జాబితాను రెండు కేటగిరీగా విభజించి అందులో అధిక జనాభా గల పెద్ద రాష్ట్రాలను ఒక జాబితాలో చేర్చారు.
 
అదేవిధంగా చిన్న రాష్ట్రాలను మరో జాబితాలో చేర్చారు. పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక టాప్ 4లో నిలిచాయి. యూపీ, బీహార్, ఒడిస్సా అడుగునపడ్డాయి. చిన్న రాష్ట్రాలలో గోవా అగ్ర స్థానంలో నిలిచింది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ జాబితా విడుదల చేశారు. అందులో చండీగడ్ అగ్ర స్థానంలో నిలిచింది.