శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (06:15 IST)

నేను అలా చేసుంటే వైసీపీ పరిస్థితి ఏంటి? : చంద్రబాబు

తాను సీఎంగా ఉన్నప్పుడు కన్నెర్ర చేసి ఉంటే వైసీపీ నేతలు ఈ స్థాయికి వచ్చేవాళ్లా అని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 

కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం ప్రపంచమంతా తిరిగానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డానన్నారు. ఇవాళ తెలుగుజాతిని చూస్తే బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు తేవడానికి రాజకీయం ఉండాలని తెలిపారు. కట్టుబట్టలు, నెత్తిన అప్పుపెట్టుకుని ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. 

ఎన్టీఆర్‌కు, తనకు ప్రపంచ గుర్తింపు తెచ్చింది కార్యకర్తలేనని గుర్తుచేశారు. కావాలని టీడీపీ నేతలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ఎన్నికల ముందు గాలికబుర్లతో ఓట్లు దండుకున్నారని అన్నారు. 

కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అసెంబ్లికి ప్రతిపక్ష నేత వెళితే గేటు వద్దే అడ్డుకున్నారని విమర్శించారు. వయస్సులో చిన్నవాడు, గౌరవం ఇవ్వడం కూడా రాదని విమర్శించారు. ఇబ్బందులు, సమస్యలు సృష్టిస్తే… వడ్డీతో సహా చెల్లిస్తారన్నారు.

వైసీపీ నేతలు మయసభను తలపిస్తున్నారన్నారు. కానీ ఎప్పటికైనా పాండవులే గెలుస్తారన్నారు. తెలివితేటలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు. ఏడు నెలలుగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.