శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (11:07 IST)

భార్యతో సన్నిహిత ఫోటోలే కాదు.. న్యూడ్ ఫోటోలూ షేర్.. స్నేహితుల అరెస్ట్

భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను స్నేహితుడికి చేశాడు ఓ భర్త. దీన్ని గమనించిన భార్య తన భర్త వికృత చేష్టలపై సైబ‌రాబాద్ పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. పోలీసుల ఫిర్యాదులో.. తన భర్త తనతో కల

భార్యతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను స్నేహితుడికి చేశాడు ఓ భర్త. దీన్ని గమనించిన భార్య తన భర్త వికృత చేష్టలపై సైబ‌రాబాద్ పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. పోలీసుల ఫిర్యాదులో.. తన భర్త తనతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన దృశ్యాలను తన భర్త అతడి స్నేహితుడికి పంపుతున్నట్లు వెల్లడించింది. 
 
తన భర్త స్నేహితుడు శ్రీమ‌న్‌ ఆన్‌లైన్‌ ద్వారా చెన్నైలో ఆ దృశ్యాలను చూస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి భర్త కృష్ణ చైతన్యను అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణను ముమ్మరం చేశారు. 
 
ఈ విచారణలో కృష్ణ చైతన్య మాత్రమే కాకుండా అతడి స్నేహితుడు శ్రీమన్ కూడా తన భార్య న్యూడ్‌ ఫోటోలను స్కైప్‌ ద్వారా పంపించేవాడ‌ని తాము తేల్చిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చెన్నైకి వెళ్లారు.