సీన్ రివర్స్... రూ.7.20 లక్షలు కొట్టేసింది.. పెళ్లి చేసుకుని జంప్
సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటివరకు అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిల కథలను వినేవుంటాం. కానీ ఇక్కడ ఓ యువతి ప్రేమ పేరిట అబ్బాయిని మోసం చేసింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలో పెళ్లి పేరుతో యువకుడిని ఓ యువతి మోసం చేసింది.
అమెరికాలో ఉంటున్న తెనాలి యువకుడికి ఆమె గాలం వేసింది. మ్యాట్రిమోనిలో ''మైనేని సముద్ర'' పేరుతో యువతి పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్త పెళ్లిదాక వెళ్లింది. ఇంకేముందు పెళ్లిపీటల మీద కూర్చోవాలని యువకుడు ముచ్చటపడ్డాడు.
ఇద్దరు పెళ్లికి ముహూర్తాన్ని కూడా ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి పెళ్లి హైరానా మొదలైంది. పెళ్లి ఖర్చుల కోసం యువతి, యువకుడి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. పెళ్లి షాపింగ్ కోసం రూ.7.20 లక్షలు తన అకౌంట్‌లో యువతి వేయించుకుంది.
పెళ్లి మోజులో పడ్డ అబ్బాయి.. ఆగమేఘాలమీద భారత్‌కు వచ్చాడు. ఆ వెంటనే పెళ్లి చేసుకునేందుకు యువతి ఊరికి వెళ్లాడు. ఇంకేముందు యువకుడిని మోసం చేసి ఆమె పరారైంది. దీంతో ఆ యువకుడు ఉసూరుమంటు పోలీసులను ఆశ్రయించాడు.