బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (13:55 IST)

భర్తతో కలిసే వుంటాను.. ఇక నన్ను వదిలేయ్.. యాసిడ్ దాడి

victim woman
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. విశాఖలో తాజాగా ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందువానిపాలెంలో ఈ నెల 7న వివాహితపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డారు. 
 
కె.శిరీష బ్యూటీషియన్. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా నివస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగరావుతో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఇటీవల శిరీష, ఆమె భర్త మళ్లీ ఒక్కటయ్యారు. 
 
భర్తతో తాను కలిసి ఉంటున్నానని, తన వద్దకు రావొద్దని నర్సింగరావుకు శిరీష చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేకపోయిన ఆటో డ్రైవర్ నర్సింగ్ ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. స్థానికులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
యాసిడ్ తీవ్రత తక్కువ కావడంతో పెను ప్రమాదం తప్పినా ముఖంపై రాషెస్ వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.