శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (12:14 IST)

కొడుకుతో బైక్‌పై వెళ్తున్న మహిళ.. లారీ టైర్ కింద పడి రెండు ముక్కలు

road accident
ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 
 
వివరాల్లోకి వెళ్లితే.. జగదేవపూర్ మండలం గణేష్ పల్లి గ్రామానికి చెందిన గడియరం పద్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై సోమవారం ఉదయం సిద్దిపేట నుండి గణేష్ పల్లికి వెళుతుంది. 
 
ఈ క్రమంలో కుకునూర్ పల్లి ఇండియన్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే సిద్దిపేట నుంచి వస్తున్న లారీ స్పీడ్ కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. 
 
దీంతో బైక్‌పై ఉన్న మహిళ లారీ టైర్ కింద పడి రెండు ముక్కలై అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకు సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.