బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 మార్చి 2017 (12:18 IST)

హాస్టల్‌లో రూమ్ మేట్ దారుణం.. బాస్‌ బ్లాక్‌మెయిలింగ్‌తో నగ్నవీడియోలు, ఫోటోలు షేర్ చేసింది..

ఉద్యోగాల కోసం హాస్టల్స్‌లో ఉండే యువతుల సంఖ్య పెరిగిపోతోంది. అలా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు.. యువతులు రూమ్ మేట్స్‌తో జాగ్రత్తగా ఉండాలనేందుకు ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. తోటి రూమ్ మేట్ ఫోటోలను, న

ఉద్యోగాల కోసం హాస్టల్స్‌లో ఉండే యువతుల సంఖ్య పెరిగిపోతోంది. అలా హాస్టల్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు.. యువతులు రూమ్ మేట్స్‌తో జాగ్రత్తగా ఉండాలనేందుకు ఈ ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. తోటి రూమ్ మేట్ ఫోటోలను, నగ్న వీడియోలను వాట్సప్‌లో ఇతరులకు షేర్ చేసిన ఘటన కేపీహెచ్‌బీ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ నగరం, కేపీహెచ్‌బీ పరిధిలోని అడ్డగుట్ట హాస్టల్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. తోటి రూమ్‌ మేట్ తనకు తెలియకుండా తన నగ్న చిత్రాలను, వీడియోలను ఇతరులకు షేర్ చేయడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. పొద్దుటూరుకు చెందిన ఓ 32ఏళ్ల యువతి కూకట్ పల్లి సొసైటీలోని పూజిత ఉమెన్స్ డీలక్స్ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. సదరు యువతి గదిలోనే బాధితురాలు రూమ్ మేట్‌గా ఉంది. వీరిద్దరి పరిచయం ఒకానొక దశలో ఒకే దగ్గర పనిచేసేలా చేసింది. అయితే సంస్థ డైరక్టర్ ఆలపాటి శివయ్య నుంచి బాధితురాలికి వేధింపులు ఎదురు కావడంతో బాధితురాలు వేరే ఉద్యోగంలో చేరింది. 
 
అయితే బాధితురాలు ఉద్యోగం మానేసినా.. పొద్దుటూరుకు చెందిన ఆమె రూమ్ మేట్ మాత్రం అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీంతో బాధితురాలి రూమ్‌మేట్‌ను బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. శివయ్య చెప్పినట్లుగానే బాధితురాలి రూమ్ మేట్ వాట్సాప్ ద్వారా శివయ్యకు ఆ ఫోటోలు చేరవేసింది. అంతేకాదు, నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచి అందులో ఫోటోలు అప్ లోడ్ వచ్చింది. రూమ్ మేట్ తీరుపై అనుమానం వచ్చిన బాధితురాలు.. ఆమె ల్యాప్ టాప్, సెల్ ఫోన్లలో తనిఖీ చేయగా అందులో తన నగ్న ఫోటోలు, వీడియోలు కనిపించాయి.
 
దీంతో రూమ్ మేట్ ను బాధితురాలు గట్టిగా నిలదీసింది. హైమా కన్సల్టెన్సీ డైరెక్టర్ శివయ్య ఆదేశానుసారమే తాను ఇలా చేయాల్సి వచ్చిందంటూ సమాధానం ఇచ్చింది. అనంతరం బాధితురాలు సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను అరెస్టు చేశారు.