1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 జులై 2016 (11:24 IST)

పరాయి మహిళతో భర్త అలా ఉండగా చూసి తట్టుకోలేక...

పరాయి మహిళతో కట్టుకున్న భర్త 'ఆ' విధంగా ఉండటాన్ని చూసి ఆ మహిళ జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

పరాయి మహిళతో కట్టుకున్న భర్త 'ఆ' విధంగా ఉండటాన్ని చూసి ఆ మహిళ జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన దుర్గ, బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బొడ్డు నరేష్‌ ఇరువురు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత సుమారు సంవత్సరకాలంగా భర్త బొడ్డు నరేష్‌ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఆమె ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బొబ్బిల్లంక చేరుకున్నారు. తమ అల్లుడే తమ కుమార్తెను కొట్టి చంపి ఉరివేశాడని విలపించారు. అయితే నరేష్‌ బంధువులు మాత్రం ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.