శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (09:32 IST)

భర్తను కాదని ప్రియుడితో సహజీవనం.. పెళ్లి చేసుకోవాలంటూ ఆత్మహత్యా బెదిరింపు

ఓ వివాహిత కట్టుకున్న భర్తనుకాదని ప్రియుడి చెంతకుచేరింది. అతనితోనే సహజీవనం చేస్తూ వచ్చింది. నలుగురు నాలుగు మాటలు అనడంతో పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడితెచ్చింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుక

ఓ వివాహిత కట్టుకున్న భర్తనుకాదని ప్రియుడి చెంతకుచేరింది. అతనితోనే సహజీవనం చేస్తూ వచ్చింది. నలుగురు నాలుగు మాటలు అనడంతో పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడితెచ్చింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకొస్తే పెళ్లి చేసుకుంటానని ప్రియుడు తెగేసి చెప్పాడు. విడాకుల పత్రాలు లేకున్నా వివాహం చేసుకోవాలంటూ పట్టుబట్టి.. సెల్‌టవరెక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. కడప జిల్లా జలదుర్గం మండలం త్యాప్లి గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ గ్రామానికి చెందిన వివాహిత పఠాన్ షాహినాకు కనమర్లపూడి గ్రామానికి చెందిన లాజర్‌ అనే వ్యక్తితో ఒక యేడాది క్రితం పరిచయమైంది. అయితే షాహినాకు అప్పటికే వివాహమైంది. అయినా ఆమె భర్తను వదిలేసి లాజర్‌తో కనమర్లపూడికి వచ్చి సహజీవనం చేస్తూ వచ్చింది. అయితే ప్రియుడితో సహాజీవనం సాగిస్తున్న షాహినా అతడిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
 
భర్త నుంచి విడాకులు తీసుకురావాలని షాహినాకు ప్రియుడు లాజర్ చెప్పాడు. దీంతో విడాకులు తీసుకురాకున్నా తనను పెళ్ళి చేసుకోవాలని షాహినా లాజర్‌పై ఒత్తిడి చేయాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో సెల్‌టవరెక్కి ఆమె నిరసనకు దిగింది. సెల్‌టవరెక్కి నిరసనకు దిగిన ఆమెను గ్రామస్థులు నచ్చజెప్పేప్రయత్నం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆమె సెల్‌టవర్ దిగింది. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.