శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (07:52 IST)

చంద్రబాబుపై జగన్ విమర్శలు.. ఏసీ గది నుంచి బయటికి రారు.. నిద్రలేవకముందే..

బంగారంపై తీసుకున్న రుణాలను రద్దు చేస్తామని చెప్పి.. ప్రస్తుతం బంగారంపై రుణాలు ఇవ్వవద్దని చెబుతున్నారని, రైతులకు బ్యాంకులు రుణాలివ్వక, అప్పులు దొరకనీయకుండా చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారని వైకాపా అధిన

బంగారంపై తీసుకున్న రుణాలను రద్దు చేస్తామని చెప్పి.. ప్రస్తుతం బంగారంపై రుణాలు ఇవ్వవద్దని చెబుతున్నారని, రైతులకు బ్యాంకులు రుణాలివ్వక, అప్పులు దొరకనీయకుండా చేసి వారిని ఇబ్బంది పెడుతున్నారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు అండగా నిలవాలని జగన్ సూచించారు. 
 
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడా పర్యటించలేదని, ఆయన ఇక్కడికి వస్తే ప్రజల ఇబ్బందులేమిటో తెలిసేవని అన్నారు. టీవీల్లో కనిపించడం కోసం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో తిరిగారని విమర్శలు గుప్పించారు.
 
పిల్లనిచ్చిన మామనే కాదు, తనకు ఓట్లేసిన వారిని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఇటువంటి సీఎం దేశంలో ఎక్కడా ఉండరని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలో 3 లక్షల ఎకరాల పత్తి, లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల్లో మిరప వేశారని, అందులో సగభాగం మునిగిపోయిందని జగన్ అన్నారు.
 
జగన్ చేసిన విమర్శలను అధికార పార్టీ నేతలు తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఏసీ గది నుంచి బయటకు రాని జగన్‌కు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. వైయస్ జగన్ నిద్ర లేవక ముందే చంద్రబాబు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందన్నారు. వైసిపి కాంట్రాక్టర్ పనులతోనే దాచేపల్లి నీట మునిగిందని ఆరోపించారు. వైసిపి అధినేత జగన్ తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో డిపాజిట్లు కూడా రావని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు భగ్గుమన్నారు.