శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 జులై 2019 (19:33 IST)

జగన్ వచ్చాక అమరావతి భూముల ధరలు ఢమాల్.... బాబు ధ్వజం

వైసీపీ మొదటి నుంచీ అమరావతిని వ్యతిరేకించిందని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమరావతిని వ్యతిరేకించేందుకు వైసీపీ నేతలు సర్వశక్తులొడ్డారన్నారు. కొంతమందితో హైకోర్టు పిటిషన్ వేయించారన్నారు. రాజధాని శంకుస్థాపనకు పిలిచినా వైసీపీ నేతలు రాలేదన్నారు.

పెట్టుబడులు కూడా అడ్డుకునే స్థితికి వచ్చారన్నారు. అప్పుడు కష్టపడ్డాం కనుకే ఇప్పుడు భవనాలు తయారయ్యాయన్నారు. అమరావతిపై వైసీపీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. రాజధానిని అడ్డుకునే విధంగా జగన్ చర్యలు ఉన్నాయన్నారు. భూములు ఇవ్వొద్దని ఆనాడు రైతులను రెచ్చగొట్టారన్నారు. పంటపొలాలను వైసీపీ నేతలు తగులబెట్టారన్నారు.
 
ఇంకా ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. " వైసీపీ వచ్చాక రాజధానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఆర్థిక మంత్రి ముళ్ల కంపలు అని వెటకారంగా మాట్లాడుతున్నారు. నిర్మాణంలో ఉన్న ఒక రాష్ట్ర రాజధాని గురించి మేరే ఇలా మాట్లాడితే మిగతా వాళ్లు ఎలా మాట్లాడతారు? వరల్డ్ బ్యాంకు ఇన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేయడానికి మీరు రాసిన లేఖలు కాదా? 
 
రాజధానిని మీరూ ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని మీరు చేస్తున్న విచారణలే అద్దం పడుతున్నాయి. ఆర్థిక మంత్రి తన విశ్వసనీయతను కోల్పోతున్నారు. ఆర్థిక మంత్రి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఈరోజు జరిగింది దురద్రుష్ట సంఘటన. మీ అబ్బ జాగీరు కాదు రాష్ట్రం. రాష్ట్రానికి రెండు కళ్లు లాంటి అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లను భ్రష్టు పట్టిస్తున్నారు. 
 
మీరు చేస్తున్న అరాచకాల కారణంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టె వారు కూడా వెనక్కి పోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఏపీకి నీరు లేకపోయినా పర్వాలేదు. తెలంగాణకు నీరు ఇవ్వాలని మీరు ఉత్సాహ పడుతున్నారు. హడావుడిగా అసెంబ్లీ లో బిల్లులు పెట్టి, మేము వాటిని వ్యతిరేకించామని ఆరోపణలు చేయడం ఏంటి? 
 
త్వరలోనే అమరావతితో పాటు అన్నిటి పైనా వాస్తవ పత్రాన్ని విడుదల చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరిగేలా చేస్తాం. దాదాపుగా 2 నెలల అవుతుంది. ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. జగన్ అనుభవ రాహిత్యం  కారణంగా రాష్ట్రం భ్రష్టు పడుతుంది" అని అన్నారు.