ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (15:20 IST)

పామును నోట్లో పెట్టుకుని చెలగాటం... కాటేయడంతో గాల్లో కలిసిన ప్రాణాలు

snake bite
కొందరు యువకులు తమ ధైర్యసాహసాలను ప్రదర్శించేందుకు చేసే కొన్ని పనులు వారి ప్రాణాలకే ముప్పు తెస్తుంటాయి. మరికొందరు పోకిరీల పిల్ల చేష్టలకు చేస్తూ మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. 
 
స్థానిక ప్రాంతానికి చెందిన మోచి శివరాజ్ (20) అనే యువకుడు పాములను పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో గురువారం అతను సుమారు రెండు అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకున్నాడు. 
 
అనంతరం ఆ విష నాగును నోట్లో పెట్టుకుని సెల్ఫీ వీడియో కోసం ప్రయత్నించాడు. అయితే, పాము ఆ సమయంలో యువకుడి నోట్లో విషం చిమ్మింది. దాంతో కొంతసేపటికే శివరాజ్ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.