మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2016 (15:09 IST)

పుల్లన్న, అచ్చెన్నా నమస్కాం.. జగన్ :: ఏమయ్యా జగన్ మేం కనిపించలేదా... కేఈ కృష్ణమూర్తి

హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరంకు అధికార, విపక్ష నేతలంతా ఓసారి బయలుదేరారు. వీరంతా యాదృచ్ఛితంగా ఒకే విమానంలో ఎక్కారు. ఇందులో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, కేసీ కృష్ణమూర్తి మరి

హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరంకు అధికార, విపక్ష నేతలంతా ఓసారి బయలుదేరారు. వీరంతా యాదృచ్ఛితంగా ఒకే విమానంలో ఎక్కారు. ఇందులో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, కేసీ కృష్ణమూర్తి మరికొంతమంది టీడీపీ నేతలతో పాటు విపక్ష నేత జగన్, ఇతర వైకాపా నేతలు ఉన్నారు. 
 
ఈ విమానంలోకి ఎక్కగానే అచ్చెన్నాయుడు, జగన్‌కు పక్కపక్క సీట్లు వచ్చాయి. వీరి ముందు వరుసలో రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ సాయిబాబా, వెనుక మంత్రులు ప్రత్తిపాటి, కేఈలు ఉన్నారు. తొలుత సాయిబాబాను పలకరించిన జగన్, మీడియా అంతా నువ్వే కనిపిస్తూ, మమ్మల్ని ఏకిపారేస్తున్నావని గుర్తు చేశారట. 
 
ఆపై "పుల్లన్న, అచ్చెన్నా నమస్కారం" అంటుండగా, తనను పలకరించలేదని కాస్తంత కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టు చూస్తూ, "ఏమయ్యా జగన్.. నీకు ఉత్తరాంధ్ర, కోస్తావాళ్లే కనిపిస్తారా?" అని కేఈ అడుగగా, "పెద్దాయనా..." అంటూ ఆప్యాయతతో పలకరించిన జగన్, "మిమ్మల్ని చూడలేదు. హరి ఎలా ఉన్నాడు?" అని తన క్లాస్ మేట్, కేఈ కుమారుడు హరి గురించి అడిగారు.
 
ఇక ఇలా నేతలంతా కలివిడిగా మాట్లాడుకుంటుండటాన్ని చూసిన ఇతర ప్రయాణికులు కాస్తంత ఆశ్చర్యపోయారట. ఆపై విమానం గన్నవరంలో ఆగగానే, బయటకు వచ్చిన నేతల ముఖాల్లో సీరియస్‌నెస్ వచ్చేయగా, మంత్రులు వెలగపూడికి, జగన్ బందరుకు వెళ్లారట. ఇలా వీరు ఆకాశంలోనే హాయ్, బాయ్ చెప్పుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. 
 
నిజానికి ఉదయం లేచింది మొదలుకుని రాత్రి నిద్రపోయేంత వరకు ఒకరిని ఒకరు విమర్శించుకుంటుంటారు. ఇది బయటకు మాత్రమేనని ఈ సంఘటన నిరూపితమైంది. వాస్తవానికి వ్యక్తిగత జీవితంలో ఒకరిని ఒకరు కలిసిన వేళ, ఆప్యాయంగా పలకరించుకుంటారు. ఎవరికీ ఎవరు శత్రువులు కారని తేలిపోయింది.