శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 జులై 2017 (12:23 IST)

వైఎస్ఆర్ జయంతి.. ఇడుపులపాయలో జగన్, విజయమ్మ ఘన నివాళి

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని వైకాపా అధినేత, వైఎస్ఆర్ తనయుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైస

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి 68వ జయంతి వేడుకలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని వైకాపా అధినేత, వైఎస్ఆర్ తనయుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైస్ఎస్ సతీమణి విజయమ్మలు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. 
 
వీరితో పాటు జగన్ సోదరి షర్మిల, భార్య భారతి, బావ బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డిలు ఘన నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి, అంజలి ఘటించారు. వైఎస్ జయంతి వైడుకల్లో పాల్గొనేందుకు వైకాపా కార్యకర్తలు, వైఎస్ ఆభిమానులు భారీ సంఖ్యలో ఇడుపులపాయకు తరలివచ్చారు.