ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (14:47 IST)

బాలికలకు లైంగిక వేధింపులు - క్రికెట్ కోచ్‌లపై వేటు

victim
తమ వద్ద శిక్షణ తీసుకునే బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ఇద్దరు క్రికెట్ కోచ్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో కడప క్రికెట్ అసోసియేన్ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు ప్రొద్దుటూరు క్రికెట్ యూత్ క్లబ్ నాయకులు తెలిపారు. 
 
సస్పెండ్‌ అయిన కోచ్‌ల బాధ్యతలను మహిళా కోచ్‌కు అప్పగించారు. కడప క్రికెట్ అసోసియేషన్ అనుసంధానంతో నడుస్తున్న ప్రొద్దుటూరు సబ్ సెంటర్‌లో బాలిక కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటోంది. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.