శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (12:20 IST)

వైఎస్ఆర్ జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

suicide
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని ఒకరు కన్నుమూశారు. జిల్లా కేంద్ర శివారులో ఉన్న ఫార్మసీ కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుంది. ఈ విద్యార్థిని తన చున్నీతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే, ఆమె బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. 
 
ఈ విషయంపై కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనగా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని మృతి సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. 
 
అయితే, విద్యార్థిని మృతిపై పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదనీ హత్యేనని ఆరోపిస్తున్నాయి. విద్యార్థిని మృతివెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలని సూచించాయి.