శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (12:17 IST)

ఆ బాలికను అలా తాకుతూ ఆనందం పొందా... ఆత్మహత్య చేసుకుంటుందనుకోలేదన్న నిందితుడు

లైంగిక వేధింపులతో ముక్కుపచ్చలారని 14 ఏళ్ల బాలిక జీవితాన్ని చిదిమేసిన కామాంధుడు వినోద్ జైన్ తను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.


విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో లోటస్ లెజెండ్ అపార్టుమెంటులో 14 ఏళ్ల బాలిక పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన మాట నిజమేనని వినోద్ అంగీకరించాడు. బాలిక పాఠశాల నుంచి వచ్చేటపుడు, వెళ్లేటపుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.
 
ఆమెను తాకరాని చోట తాకుతూ వికృతానందం పొందేవాడినని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఐతే బాలిక ఇంత పని చేస్తుందని తను ఊహించలేకోపయినట్లు అతడు చెప్పాడు. బాలిక స్కూలు నుంచి బయటకు వచ్చేటపుడు అక్కడ కూడా ఆమెను వేధించినట్లు అంగీకరించాడు.
 
అపార్టుమెంట్లో వున్న సిసి కెమేరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. బాలిక పట్ల అతడు చేసిన వికృత చేష్టలు కూడా రికార్డయ్యాయి. అపార్టుమెంట్ మేడపై నుంచి బాలిక ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు కూడా రికార్డయ్యాయి.