రెచ్చిపోతున్న వైకాపా నేతల అనుచరులు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

ydata-srcp
ydata-srcp
సెల్వి| Last Updated: గురువారం, 5 నవంబరు 2020 (19:09 IST)
వైసీపీ నేతల అనుచరులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ పని తీరును ప్రశ్నించిన సామాన్య జనాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అనుచరులు దౌర్జన్యకాండకు దిగారు. రోడ్లు బాగాలేవని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని ప్రశ్నించిన ఆటో డ్రైవర్‌ రవికుమార్‌పై రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నాడన్న నెపంతో ఆటో డ్రైవర్‌ రవికుమార్‌ను కారులో ఎక్కించుకుని.. ఊరిబయటకు తీసుకెళ్లి చితకబాదారు.

ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే అనుచరులపై మండిపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు స్థానిక నేతలు కూడా ఈ ఘటనను ఖండించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని మండిపడ్డారు.దీనిపై మరింత చదవండి :