శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (11:55 IST)

రజినీకాంత్ స్టైల్లో బీడీ కాల్చిన వైసీపీ ఎమ్మెల్యే

raghuramireddy
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ నెల మూడున నోటిఫికేషన్ విడుదల కాగా.. 14, 15, 16న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కమలాపురం మున్సిపాలిటీలో పర్యటించారు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.
 
ఈ సందర్బంగా చేతివృత్తి కార్మికులతో మాట్లాడారు. బీడీకార్మికులు అధికంగా ఉండే ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అక్కడ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రజినీకాంత్ స్టైల్లో బీడీ వెలిగించి పొగవదిలారు. 
 
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కష్టపడి పనిచేస్తున్న బీడీ కార్మికులను ఉత్సాహపరిచేందుకే సరదాగా తాను బీడీ వెలిగించానని అన్నారు. పొగతాగటం తగ్గించటం ఉత్తమం అని అక్కడి వారికి సూచించారు. ఎమ్మెల్యే బీడీ పొగలు గుమ్ములుగా విడవడం చూసి అక్కడ ఉన్న వారు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.