సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (15:16 IST)

కేబినెట్ నుంచి మంత్రి గంటాను బర్తరఫ్ చేయాలి : వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావును తక్షణం తొలగించాలని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉషారాణి ఆత్మ‌హ‌త్య‌ చేసు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావును తక్షణం తొలగించాలని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఉషారాణి ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న విషయం తెల్సిందే. లెక్చరర్ వేధింపుల కారణంగా ఈ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
దీనిపై ఆర్కే.రోజా స్పందించారు. ఉషారాణి ఆత్మహత్యపై స్పందించాల్సిన మంత్రి గంటా శ్రీనివాసరావు విదేశాల్లో హాయిగా ప‌ర్య‌టిస్తున్నార‌న్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న గంటాను వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించాలని అన్నారు. 
 
రాష్ట్రం అన్ని విష‌యాల్లోనూ నెంబ‌ర్ వ‌న్‌గా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంటున్నార‌ని అయితే, అఘాయిత్యాలు, అరచకాలు, ఆత్మహత్యల్లో మాత్రం రాష్ట్రం అగ్ర‌స్థానంలో ఉంద‌ని ఆమె విమ‌ర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర స‌ర్కారు నియ‌మించి కమిటీ ఏమైందని ఆమె అడిగారు.